ప్రపంచ వ్యాప్తంగా 3,71,151 కరోనా కేసులు

24 Feb, 2021 14:17 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 3,71,151 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,26,54,146 దాటింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్‌, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరణాల్లోనూ అమెరికానే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ కొనసాగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా  10,267 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పటివరకు 88,239,672 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2.19 కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చదవండి : (మళ్లీ కరోనా పంజా.. పలుచోట్ల మార్చి 1 నుంచి ఆంక్షలు)
(కలకలం రేపుతున్న కొత్త రకం కరోనా)

మరిన్ని వార్తలు