‘కరోనా’ శాశ్వతంగా ఉండిపోవచ్చు!

16 Oct, 2020 14:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న, ప్రజలు చిత్తశుద్ధితో భౌతిక దూరం పాటిస్తున్న దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఇప్పటికీ విజంభిస్తోంది. కరోనాను కచ్చితంగా కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎలా, ఎప్పుడు తగ్గుతుందనే కలవరం వారిని వెంటాడుతూనే ఉంది. లాక్‌డౌన్‌ల వల్ల ప్రయోజనం లేదని, వాటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువని కొంత మంది నిపుణలు వాదిస్తున్నారు. 

నిత్య జీవన పోరాటంలో భాగంగానే కరోనాను సామాజికంగా ముఖాముఖి ఎదుర్కోవడమే పరిష్కారమని వారు నిపుణులు సూచిస్తున్నారు. ముసలి, ముతక, వ్యాధులతో బాధ పడుతున్నవారిని మాత్రమే ఇళ్లకు పరిమితం చేసి మిగతా వారు సామాజికంగా కరోనా ఎదుర్కోవాలని, తద్వారా ‘హెర్డ్‌ ఇమ్యునిటీ (సామూహిక రోగ నిరోధక శక్తి) అభివద్ధి చెందుతోందని వారి వాదనలో నిజం లేకపోలేదు. రోగ నిరోధక శక్తి అందరిలో పెరగుతుందన్న గ్యారంటీ లేదు కనుక వ్యాక్సిన్లు కూడా అవసరమే. అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు చేతులు ముడుచుకొని కూర్చోవడం కుదరదు కనుక సామూహికంగానో, సామాజికంగానో కరోనాతో పోరాడక తప్పదు. 
(చదవంవడి: కోవిడ్‌ కట్టడిలో పాక్‌ బెటర్‌: రాహుల్‌)

ప్రజల్లో సామూహికంగా రోగ నిరోధక శక్తి పెరగడం లేదా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరోనా వైరస్‌ కనుమరుగవుతుందని చెప్పలేం. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా, ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినా నేటికి తట్టు, అమ్మవారు లాంటి బాల్యంలో వచ్చే రోగాలు, వయస్సులో వచ్చే సుఖరోగాలు, దోమల వల్ల వచ్చే మలేరియా లాంటి అంటు రోగాలు, వైరస్‌ వల్ల వచ్చే ఇన్‌ఫ్లూయెంజాలు ఇప్పటికీ వస్తున్న విషయం తెల్సిందే. వాటిలాగే కరోనా శాశ్వతంగా పోయే అవకాశం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఇతర అంటు రోగాల లాగానే కరోనా కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కో చోట తక్కువ స్థాయిలోనో, తీవ్ర స్థాయిలోనో విజంభించవచ్చు. వ్యాక్సిన్లు లేదా స్వతహాగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది’....నెదర్లాండ్స్‌లోని యుట్రెక్ట్‌ యూనివర్శిటీ థియారిటికల్‌ ఎపిడిమియాలోజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న హాన్స్‌ ఈస్టర్‌బీక్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. 
(చదవండి: చైనా వ్యాక్సిన్‌ పరీక్ష : సానుకూల ఫలితాలు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు