చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: డబ్ల్యూహెచ్‌వో

24 Oct, 2020 13:51 IST|Sakshi

జెనీవా: కోవిడ్‌-19 మహమ్మారిలో ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి  వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరార్థ గోళంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందని, ఆయ దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని టెడ్రోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల్లో వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు. 

‘మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇంకా కీలక దశలోనే ఉన్నాం. రాబోయే నెలలు పలు దేశాలకు పరిస్థితులు మరింత కఠినంగా మారబోతున్నాయి. తక్షణ చర్యలుగా  పాఠశాలలను మూసివేసి, వైద్య సేవలు మరిన్ని అందించాలని మేం ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ విషయాన్ని మేం ఫిబ్రవరిలోనే చెప్పాం. మ‍రలా ఇప్పుడు చెబుతున్నాము’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చదవండి: భారత్‌తో చర్చలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు