చైనాలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

29 Jul, 2020 22:08 IST|Sakshi

షిన్‌జియాంగ్ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి పుట్టినిల్లు చైనా అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వుహాన్‌లో మొద‌లైన ఈ వైర‌స్ ఖండాంత‌రాల‌ను దాటి ఇప్ప‌టికి విజృంభిస్తోనే ఉంది. చైనాలో కొంత‌కాలంగా ప‌దుల సంఖ్యలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా బుధ‌వారం కొత్త‌గా 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద‌వ‌డంతో మ‌రోసారి కేసుల సంఖ్య పెరుగుత‌న్న‌ట్లుగా కనిపిస్తోంది. గ‌డిచిన మూడు నెల‌ల కాలంలో ఒకేరోజు ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. చివ‌రిగా  ఏప్రిల్ 13న ఒక్క‌రోజే 108 కేసులు న‌మోద‌య్యాయి. ఈ విషయాన్ని ఆదేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది.  కాగా కొత్త కేసుల్లో 89 షిన్‌జియాంగ్ ప్రాంతం‌లోనే నమోదయ్యాయి.

కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న చోట క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌డంతో పాటు భారీ స్థాయిలో క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేప‌డుతున్నారు. ఒక్క బీజింగ్‌లోనే దాదాపు 10 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కొత్త కేసులతో క‌లుపుకొని చైలో మొత్తం 84,060 క‌రోనా కేసులు న‌మోదు కాగా, మ‌ర‌ణాల సంఖ్య 4,634గా ఉంది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి 67 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. 6ల‌క్ష‌ల 60వేల మంది మ‌ర‌ణించారు. 

మరిన్ని వార్తలు