ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ కాలేదు : చైనా వైరాలజిస్ట్‌

16 Jun, 2021 06:38 IST|Sakshi

న్యూయార్క్‌: చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి, చైనా బ్యాట్‌వుమెన్‌గా ప్రసిద్ధి చెందిన షి ఝెంగ్లి తొలిసారిగా పెదవి విప్పారు. చైనా ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతున్నట్టుగానే ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ కాలేదని పేర్కొన్నారు. ఎప్పుడూ మీడియాతో మాట్లాడని ఆమె న్యూయార్క్‌ టైమ్స్‌కు ఈ మెయిల్‌ ద్వారా  ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అవలేదన్నది వాస్తవం. ఈ భూమ్మీద ఆధారాలు లేని విషయానికి ఎవరైనా ఆధారాన్ని ఎలా చూపిస్తారు’’అని ఆమె ప్రశ్నించారు. ‘‘అమాయకులైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎందుకిలా నిందలు వేస్తోంది’’అని షి ఝెంగ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: చైనాలో మరో విపత్తు!

  

మరిన్ని వార్తలు