గబ్బిలాల నుంచి కరోనా: చాలా తక్కువ మార్పులతో..

14 Mar, 2021 17:17 IST|Sakshi

లండన్‌: కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనాన్ని పీఎల్‌ఓఎస్‌ బయోలజీ జర్నల్‌ ప్రచురించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ కలిగించే సార్స్-కోవ్-2 వైరస్‌‌లో కూడా అనేక జన్యు రూపాలు ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాపించడం కంటే 11 నెలల ముందే సార్స్-కోవ్-2 వైరస్ ప్రత్యేక జన్యు రూపాన్ని గుర్తించినట్లు తెలిపారు. డీ614జీ మ్యూటేషన్‌ వైరస్‌లోని మార్పులను ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మిగతా వైరస్‌ వలే సార్స్-కోవ్-2 వైరస్‌‌ కూడా కొన్ని మార్పులతో వ్యాపిస్తుందని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త ఆస్కార్‌ మాక్లీన్‌ తెలిపారు. కానీ, ఈ వైరస్‌ వ్యాప్తి చెందే విధానంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సాధారణంగా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో​ దాని లక్షణాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని, సార్స్-కోవ్-2 వైరస్ కూడా అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్‌లోని టెంపుల్‌ యూనీవర్సీటి రచయిత సెర్గిపోండ్‌ తెలిపారు. సార్స్-కోవ్-2 వైరస్ మానవులకు సోకే సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే ఈ వైరస్‌ లక్షణాలు ముందుగా గబ్బిలాల్లో అభివృద్ధి చెందుతాయిని ఈ అధ్యయనంలో తెలిపారు. ఇది ప్రధానంగా మానవునిలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. అయితే దేశంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్‌లు అభివృద్ది చేసి ప్రజలకు అందించాలని గ్లాస్గో యూనివర్సీటి  పరిశోధకుడు డేవిడ్‌ ఎల్‌ రాబర్గ్‌సస్‌ పేర్కొన్నారు.
చదవండి: పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి..

మరిన్ని వార్తలు