కరోనా సీజనల్‌ వైరస్‌ కాదు: డబ్ల్యూహెచ్‌వో

11 Aug, 2020 06:11 IST|Sakshi

లండన్‌: కోవిడ్‌ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్‌లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సేవల విభాగం డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ వెల్లడించారు. ఈ వైరస్‌ ఏ సీజన్‌లో వస్తుందో చెప్పలేకపోతున్నామని, శ్వాస సంబంధిత వైరస్‌ ఇన్‌ఫ్లుయెంజా ప్రధానంగా శీతాకాలంలో వ్యాప్తి చెందుతుందని, అయితే కరోనా వైరస్‌ మాత్రం వేసవిలో కూడా విజృంభిస్తోందని ఆయన అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు కరోనా వైరస్‌ ఎండ వేడిమికి తట్టుకోలేదని, వేసవి కాలంలో మనగలగలేదని గతంలో ఊహించారు. వైరస్‌ని ఎంత అణచివేయాలని చూసినప్పటికీ అది తిరిగి విజృంభిస్తూనే ఉందని రయాన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు