హద్దులు చెరిపేశారు : వంతెనపై ఒక్కటైన జంట

18 Oct, 2020 11:49 IST|Sakshi

టొరంటో : కరోనా వైరస్‌తో పలువురు పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం మరికొందరు పెళ్లి కోసం సాహస కార్యాలకూ వెనుకాడలేదు. ఇక అమెరికా, కెనడాలకు చెందిన జంట వినూత్న పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటై వార్తల్లో నిలిచారు. అమెరికా-కెనడా సరిహద్దుల్లో నదిపై నిర్మించిన వంతెనే వేదికగా ఆహ్లాదకర వాతావరణంలో వివాహ వేడుకను నిర్వహించారు. పడవల్లో అతిధుల ఆశీస్సుల నడుమ వారు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. అమెరికా-కెనడా బోర్డర్‌లో ఉన్న వంతెనపై లిండ్సే క్లోవ్స్‌ అలెక్స్‌ లెకీలు పెళ్లి ముచ్చట తీర్చుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కెనడా సరిహద్దు నియంత్రణలను విధించడంతో వారు ఈ నిర్ణయం తసుకున్నారు.

లిండ్సే అమెరికాలోని మేన్‌ ప్రాంతానికి చెందిన వారు కాగా, అలెక్స్‌ కెనడా దేశీయులు. తొలుత వీరు నోవా సోషియాలో వివాహాన్ని ప్లాన్‌ చేసుకగా కరోనా నియంత్రణలతో లిండ్సే కుటుంబం వివాహానికి హాజరు కాలేకపోయింది. దీంతో వీరు వివాహానికి ఈ వినూత్న మార్గాన్ని అన్వేషించడంతో పాటు ఇరు కుటుంబాలను ఒప్పించారు. సరిహద్దు ప్రాంతంలో వంతెనపై వీరు ఒక్కటవ్వగా లిండ్సే తల్లితండ్రులు అమెరికన్‌ జలాలపై పడవమీద కూర్చుని ఈ వేడుకను తిలకించారు. ఈ వివాహానికి లిండ్సే, అలెక్స్‌లు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. భౌతిక దూరం నిబంధనలు పాటించేలా కేవలం 30 మంది అతిధులనే వివాహ వేడుకకు ఆహ్వానించారు. చదవండి : డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్‌ కిట్ల సరఫరా

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు