చిన్న కారణంతోనే మహిళా జర్నలిస్ట్ వేలు విరిచిన గార్డు

21 May, 2021 19:44 IST|Sakshi

టెహ్రాన్‌: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక వార్తా వెబ్‌సైట్‌లో ఫేజె మోమెని అనే మహిళా జర్నలిస్ట్ పనిచేస్తుంది. ఈ కోవిడ్ సమయంలో టీకా ప్రక్రియ గురించి ఒక నివేదికను తయారు చేస్తున్నప్పుడు మే 18న రాష్ట్ర టీకా కేంద్రం వద్ద ఉన్న గార్డు ఆమెను కొట్టారు. టీకా కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా జర్నలిస్టును బెహేష్తి మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏజెంట్ కొట్టాడని ప్రభుత్వ ఈటెమాడ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ తెలిపింది. అప్పటివరకు సేకరించిన అన్ని ఇంటర్వ్యూలను డిలీట్ చేయమని గార్డు ఆమెను కోరాడు దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే అతను ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వేలు విరిగింది. 

అయితే, అక్కడ స్థానికులు ఫేజేను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తనకు గాయాల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె కేంద్రంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహించిందని, అయితే వాటిని తొలగించమని సెక్యూరిటీ గార్డు ఆమెకు చెప్పారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఆ దేశంలో నిదానంగా జరగుతున్న కోవిడ్ -19 టీకా ప్రచారం గురించి మీడియా, నిపుణులు పదేపదే ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శిస్తున్నారు. మరి మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడి యాదృశ్చికంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారో ఇంకా తెలియదు. ఇస్లామిక్ రిపబ్లిక్ లో మహిళలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల నిరుద్యోగం తీవ్రంగా పెరగినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

చదవండి:

మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు