కరోనా చివరి వైరస్ కాదు: డబ్ల్యూహెచ్ఓ

27 Dec, 2020 10:49 IST|Sakshi

కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఈ మహమ్మారి నుండి బయటపడేందుకు దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న ఈ వైరస్ చివరిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరించారు. వైరస్ల విజృంభణ నిజ జీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తుంది అన్నారు. వీటిని ఎదుర్కోవాలంటే వాతావరణంలో వచ్చే మార్పులను పరిష్కారించడం, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేయాలనీ పేర్కొన్నారు.(చదవండి: ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా)

ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు తాత్కాలిక పరిష్కారం కోసం డబ్బులను కేటాయించడం కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి పాఠాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది అని టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్ అంతర్జాతీయ అంటువ్యాధి దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. "చాలా కాలం నుండి నిర్లక్ష్యంగా ప్రపంచం భయాందోళనలు మధ్య బతుకుంది" అని అతను చెప్పాడు. "వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు తాత్కాలికంగా నగదును కేటాయించడం, వ్యాధి అంతం అయ్యాక మరిచిపోవడం మరియు భవిష్యత్ లో రాబోయే వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం" అని అన్నారు. 2019 సెప్టెంబర్ లో గ్లోబల్ ప్రిపరేడ్‌నెస్ మానిటరింగ్ బోర్డ్, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం ప్రపంచ సంసిద్ధతపై మొదటి వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదకరమైన మహమ్మారి వ్యాధుల పట్ల ప్రపంచం ఉద్దేశ పూర్వకంగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని నివేదికలో పేర్కొనబడింది.   

"ఇది చివరి మహమ్మారి కాదని చరిత్ర చెబుతుంది, అంటువ్యాధులు జీవిత వాస్తవం" అని టెడ్రోస్ అన్నారు. ‘ఈ మహమ్మారి మానవులు, జంతువులు మరియు గ్రహం యొక్క మధ్య సన్నిహిత సంబంధాలను హైలైట్ చేసింది’ అని ఆయన చెప్పారు. "మానవులు, జంతువుల మధ్య క్లిష్టమైన అనుబంధాన్ని పరిష్కరించకపోతే భవిష్యత్ చాలా అంధకారంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం వాతావరణలో గల మార్పులకు మూలా కారణాలను కనుగొని వాటిని పరిష్కరించకపోతే విపరీతమైన అనర్దాలు ఎన్నో చూడాల్సి వస్తుంది" అని ఆయన చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు