కోవిడ్‌ శాంపిల్‌ కోసం రోబో

22 Sep, 2020 05:12 IST|Sakshi

సింగపూర్‌: గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్‌ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10 సెంటీమీటర్ల లోతు నుంచి శాంపిల్‌ను సేకరిస్తుంది. వివిధ రకాల ముక్కు పరిమాణాలు ఉన్న వారికీ అసౌకర్యం కలగకుండా శాంపిల్‌ను తీసుకుందని పరిశోధనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ రోబో వల్ల శాంపిళ్లను సేకరించే వారికి వ్యాధి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు