వ్యాక్సిన్‌ ఆశలు : అమెరికా మార్కెట్లు హైజంప్‌

9 Nov, 2020 19:06 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒకవైపు రోజుకు లక్షకుపైగా కరోనా కేసులతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించి తమ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కీల పురోగతి సాధించాయంటూ ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ ఆశాజనకమైన ప్రకటన వెలువరించింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోయాయి. (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

కరోనా వైరస్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌ లో 90 శాతానికిపైగా సానుకూల ఫలితాలు వస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణ సూచించినట్లు ఫైజర్ తెలిపింది. దీంతో డోజోన్స్‌ 1500  ఏకంగా పాయింట్లు పుంజుకుంది. ఎస్‌ అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇదే బాటలో ఉన్నాయి. యూకే మార్కెట్‌ ఎఫ్‌టీఎస్‌ఈ100 కూడా 4 శాతం ఎగిసింది. ఇతర యూరోపియన్‌ మార్కెట్లు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ట్రావెల్‌ సంస్థలు లాభాలతో కళకళలాడుతున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఓనర్‌ ఐఏజీ ఏకంగా 26శాతం  పెరిగింది. (కరోనా టెస్ట్  : 90 నిమిషాల్లోనే ఫలితం)

కాగా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో  ఫైజర్‌, జర్మన్ ఔషధ తయారీదారు బయోఎన్‌టెక్‌తో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై అమెరికా ప్రజలకు శుభవార్త అందించింది. నవంబర్ నాటికి వ్యాక్సిన్  అందుబాటులోకి తేనున్నామని ఫైజర్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు