క‌రెన్సీ నోట్ల‌పై 28 రోజుల పాటు వైర‌స్

12 Oct, 2020 11:34 IST|Sakshi

శీతాకాలంలో వైర‌స్ తీవ్ర‌త అయిదు రెట్లు పెంపు

మెల్‌బోర్న్ :  వేస‌విలోనే క‌రోనాను నియంత్రించ‌క‌పోతే ఇక శీతాకాలంలో ఇది మ‌రింత ముదిరే అవ‌కాశం ఉంద‌ని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త తెలిపారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు జ‌రిపిన అధ్య‌య‌నం ప్ర‌కారం..వేస‌వి స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌తో పోలిస్తే చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో వైర‌స్ ఎక్కువ‌కాలం జీవించి ఉంటుంద‌ని తెలిపారు. మృదువైన గాజు ప‌రిక‌రాలు, క‌రెన్సీ నోట్లు, మొబైల్ ట‌చ్ స్క్రీన్‌పై 28 రోజుల వ‌ర‌కు వైర‌స్ నిలిచే ఉంటుంద‌ని ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. వేస‌వి స‌గ‌టు ఉష్ణోగ్రతతో పోలిస్తే తేమతో నిండిన  వాతావ‌ర‌ణంలో కోవిడ్ ఐదు రెట్లు బ‌లంగా ఉంటుంద‌ని పరిశోధనకు నాయకత్వం వహించిన వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ తెలియ‌జేశారు. దీన్ని బ‌ట్టి శీతాకాలంలో ప‌రిస్థితిని నియంత్రించ‌డం అతిపెద్ద స‌వాలు అని  పేర్కొన్నారు. (కరోనాని అంతం చేస్తాం)

40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ మనుగడ  ఒక రోజు కన్నా తక్కువకు పడిపోయిందని తేలింది. టచ్‌స్క్రీన్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఎటిఎంలు, సూపర్‌మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్‌అవుట్‌లు, ఎయిర్‌పోర్ట్ చెక్ఇన్‌ల వ‌ద్ద వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉంటుంది. కరోనా సోకిన వ్య‌క్తితో ప్ర‌త్య‌క్ష సంబంధం ద్వారా ఇత‌రుల‌కు త్వ‌ర‌గా సోకే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా వారు తుమ్మ‌డం, ద‌గ్గ‌డం, మాట్లాడేప్ప‌డు విడుద‌ల‌య్యే వైరస్ క‌ణాలు ఉప‌రిత‌లాల‌పై నిల‌చే ఉంటాయి.  ఇది వైర‌స్ వ్యాప్తికి స‌హాయ‌ప‌డుతుంద‌ని  పేర్కొన్నారు.  క‌రెన్సీ  ఒక‌రి చేత నుంచి మ‌రొక‌రికి  మారేకొద్దీ వైర‌స్ వారంద‌రికి కోవిడ్ ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లేన‌ని తెలిపారు. (‘ఇలా ఇస్తే కరోనా వ్యాక్సిన్‌ అద్భుత ఫలితాలివ్వచ్చు’)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు