అమెరికాలో మరోసారి కరోనా కలకలం.. అక్కడ హై అలర్ట్‌ 

18 May, 2022 16:18 IST|Sakshi

కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్న కొన్ని దేశాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మొన్నటి వరకు చైనాలో కరోనా కొత్త వేరియంట్లు విజృంభించగా.. నార్త్‌ కొరియా సైతం కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా అగ్రరాజ్యం అ‍మెరికాలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. న్యూయార్క్ సిటీలో కరోనా మహమ్మారి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో న్యూయర్‌ పెద్ద నగరం కావడంతో జో బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. న్యూయార్క్‌ సిటీలో హై అల‌ర్ట్ విధించింది. దీంతో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచించింది. 

మరోవైపు, హై అల‌ర్ట్ జారీ చేయ‌డంపై న్యూయార్క్ సిటీ హెల్త్‌ కమిషనర్‌ డాక్టర్‌ అశ్విన్‌ వాసన్‌ మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే మ‌న‌ల్ని మ‌నం జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌న్నారు. మిత్రులు..బంధువులు, తోటి ఉద్యోగుల‌కు వైర‌స్ సంక్ర‌మించ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఏడు రోజుల స‌గ‌టు పాజిటివ్ రేటు 5.18 శాతానికి పెరిగిన‌ట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నుంచి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. 

ఇది కూడా చదవండి: రష్యా అధ‍్యక్షుడు పుతిన్‌కు ఊహించని బిగ్‌ షాక్‌

>
మరిన్ని వార్తలు