లాన్సెట్ సంచలన నివేదిక‌: గాలి ద్వారానే కోవిడ్‌ అధిక వ్యాప్తి

17 Apr, 2021 11:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాలి ద్వారానే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిపుణుల విశ్లేషణ

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్‌ నిండి ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే వైరస్ క్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయని బ్రిటన్, అమెరికా, కెనడా సైంటిస్టులు సంయుక్తంగా చేసిన అధ్యయంనలో వెల్లడైంది. అందుకే కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైరస్ (ఎయిర్ బోర్న్) అని ప్రకటించాలని వారు సూచిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉందనేందుకు  తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు వారు స్పష్టం తెలిపారు.

యుద్ధ ప్రాదికన చర్యలు చేపట్టి కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), ఇతర వైరస్‌ పీడిత దేశాలకు వారు సూచనలు చేశారు. రీసెర్చ్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించిన పలు జర్నల్స్‌ను సమీక్షించారు. గాలి ద్వారానే కోవిడ్ అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. సైంటిస్టుల నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.


కరోనా గాలి ద్వారానే వేగంగా వ్యాప్తి 
►మనుషుల ప్రవర్తన, ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ వంటి అంశాలు వైరస్‌ వ్యాప్తిలో కీలకం.

►మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్‌లో ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది.

►ఎవరైతే దగ్గకుండా, తుమ్మకుండా ఉన్నారో వాళ్ళలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా, 33 నుంచి 59 శాతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇదో కారణం.

►బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

►కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్ ని ధరించారు. అలా ధరించిన ప్రదేశాలలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి.

►నిపుణులు కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉంటుంది.

►కరోనా వైరస్ ఎయిర్ ఫిల్టర్ లలో, శుభ్రం చేసినప్పటికీ ఆసుపత్రుల బిల్డింగ్ మూలల్లో వైరస్‌ తిష్ట వేసుకుని ఉంటుంది.

►పెంపుడు జంతువుల ఆవాసాల్లో కూడా కరోనా వైరస్ గుర్తింపు.

►ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు

( చదవండి: గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్‌ టీకా నిలిపివేత

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు