Matt Hancock: పీఏకు ముద్దుల ఎఫెక్ట్‌.. మంత్రి రాజీనామా

27 Jun, 2021 09:37 IST|Sakshi

కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్‌  యాంగిల్‌ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్‌ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. 

లండన్‌:  ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్‌​ హాంకాక్‌ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్‌.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు.  ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్‌ రాసలీలలు’ పేరుతో  ది సన్‌ టాబ్లాయిడ్‌  ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. 

ఈ బంధం ఏనాటిదో..  
కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్‌ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్‌ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్‌.. 2000 సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్‌ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది.

 

ఎట్టకేలకు రాజీనామా
కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్‌ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు,  మాట్‌ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్‌కాక్‌ రాజీనామాను ఆమోదించిన బోరిస్‌.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు.

చదవండి: పార్లమెంట్‌లో పొంగుతున్న బీర్లు

మరిన్ని వార్తలు