Covid Wuhan Lab Leak: ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు

22 Feb, 2022 16:43 IST|Sakshi

Covid Leak From Wuhan Lab: ఈ కరోనా మహమ్మారికి కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని వేలెత్తి చూపించిన వేటిని లక్ష్యపెట్టక ఇప్పటికీ తనదైన శైలిలో దూకుడుగా ప్రవర్తి‍స్తూనే ఉంది. అంతేకాదు కోవిడ్‌ మూలాలుపై స్వతంత్ర దర్యాప్తు కోసం కాన్‌బెర్రా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయిన డ్రాగన్‌ కంట్రీ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. మరోవైపు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వుహాన్ ల్యాబ్‌ భాద్యతలు తీసుకునే నిమత్తం చుట్టూ ఆర్మీ జనరల్‌ను మోహరించడం, కరోనా వైరస్‌కి సంబంధించిన విషయంలో ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించకుండా తప్పుడూ కథనాలను ఇచ్చేందుకు ప్రయత్నించిందని ప్రోవిడెన్స్‌ నివేదిక వెల్లడించింది.

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మీడియా  వుహాన్ లాక్‌డౌన్‌ను డాక్యుమెంట్ చేసినందుకు ఒక చైనీస్ జర్నలిస్టును జైలులో పెట్టారు. పైగా ఈ కరోనా మహమ్మారీ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిందని ఈ మహమ్మారీతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశామని ఇక దీనిపై విచారించాల్సింది, రుజువు చేయాల్సింది ఏమి లేదంటూ చైనా బుకాయిస్తోంది. అంతేకాదు కోవిడ్‌ -19 మూలానికి సంబంధించిన ప్రచురణలపై కూడా ఆంక్షలు జారీ చేసింది.

మరోవైపు ల్యాబ్‌ లీక్‌లు జరుగుతాయని, దేశంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అడ్డకోలుగా మాట్లాడుతోంది. అంతేకాదు డిసెంబర్‌ 2021లో తైవాన్‌ అధికారికంగా SARS-COV-2 ల్యాబ్ లీక్‌ను ధృవీకరించింది కూడా. అయితే చైనా సీసీపీ మీడియా అధికారికంగా ఈ విషయం పై నోరు మెదపటం లేదు. దీంతో వ్యూహాన్‌ ల్యాబ్‌ లీక్‌ అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదమా ? లేక  కావాలని చేసిన పనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పాశాత్య వైరాలజీ శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్‌లు ఇది కుట్రగా అభివర్ణించడం గమనార్హం.

(చదవండి: మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్‌ తొలగింపు!)

మరిన్ని వార్తలు