హిందూ మహాసముద్రంలో వింత జీవి

17 Mar, 2021 19:56 IST|Sakshi

మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు, రకరకాల జంతు జాతులు ఉంటాయి. ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సహికులు ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వండర్స్ ఎన్నో ఉంటాయి. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు. తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు 3,700 అడుగుల లోతున కనీవినీ ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేసింది. 

ఈ వింత జీవి కదిలికలు అన్ని కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది పలు రకాల షేపులు మారుస్తూ, అతి వేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్ల బంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేపు మారుస్తూ కనిపించింది. కొందరు దీన్ని సముద్ర ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు. కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ని గుర్తు చేస్తున్నారు. ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్ ను  2013లో ఆన్‌లైన్‌లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్రికా తూర్పు తీరంలో తీయబడింది. ఇప్పుడు యూట్యూబ్‌లో దీనిని 1.5 మిలియన్లకు పైగా చూశారు. నాటి నుంచి నేటి వరకు ఈ విచిత్ర జీవి ఏమిటో అనేది ఎవరు చెప్పలేక పోతున్నారు.

చదవండి:

గడ్డకట్టే చలిలో డాన్స్‌ అంటే మాటలా...

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు