కోకా కోలా వివాదం: ఫెవికాల్‌ అదిరిపోయే యాడ్‌, నెటిజన్లు ఫిదా!

18 Jun, 2021 17:31 IST|Sakshi

యూరో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రెస్‌ మీట్‌ సందర్భంగా పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్‌ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో చేసిన ఈ చర్యతో కోకా కోలా కంపెనీ షేర్లు బోరుమన్నాయి. ఒక్కసారిగా కోకా కోలా షేర్లకు సుమారు 4 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.

ఆసక్తికరమైన ప్రకటనల విషయానికి వస్తే తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఫెవికాల్, తాజాగా  ఒక పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసింది. రోనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించే విషయంపై ఫెవికోల్‌ కంపెనీ ఇన్‌డైరక్ట్‌గా కోకాకోలాకు అదిరిపోయే సూచన చేసింది. ఫెవికాల్‌ తన ట్విటర్‌ పోస్ట్‌లో.. రొనాల్డో హజరైన ప్రెస్‌మీట్‌ను పోలి ఉన్న ఫోటోలో,  కోకాకోలా బాటిళ్లకు బదులు ఫెవికోల్‌ డబ్బాలను ఏర్పాటు చేసింది.  వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు. అంతేకాకుండా కంపెనీ షేర్‌ విలువ కూడా పడిపోయేది (నా బాటిల్ హేటేగీ, నా వాల్యుయేషన్ ఘటేగి)కాదని.. సూచిస్తూ వ్యంగ్యంగా కోకాకోలాకు సూచించింది.

కోకాకోలా బాటిళ్లు అక్కడి నుంచి తీయకుండా ఉండేందుకు ఫెవికాల్‌ అంటించి ఉంటే కోకాకోలాకు ఈ పరిస్ధితి వచ్చేదికాదని పేర్కొంది. కాగా ప్రస్తుతం  ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫెవికాల్‌ మార్కెట్‌ స్ట్రాటజీను చూసి నెటిజన్లు ఔరా..! అంటూ రిట్వీట్‌ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు కొన్ని సందర్బాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలపై ఫెవికోల్‌ వ్యంగ్యంగా జవాబిస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటుంది.

చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు