లాక్‌డౌన్‌.. ఎవరు బెస్ట్‌?

24 Feb, 2021 03:16 IST|Sakshi

కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిందెవరు? దీనిపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఓ భారీ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 180 దేశాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన అనంతరం 100కు ఇన్ని మార్కులు అని వేసింది.. ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలు సమర్థంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినట్లు అన్నమాట. అలాగని లాక్‌డౌన్‌ అనేసరికి.. ఒక్క కర్ఫ్యూ విధించడం ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేదు. అనేక ఇతర అంశాలను పరిశీలించింది.

పాఠశాలలు, ఆఫీసులను మూసేయడం.. బహిరంగ సమావేశాలపై నిషేధం, వృద్ధుల సంరక్షణ, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, వైద్య రంగంలో పెట్టుబడి, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడటం, ఆర్థికపరమైన ప్యాకేజీలు, ఆదాయం కోల్పోయినవారికి ఆసరాగా నిలవడం, వ్యాక్సిన్లపై ఖర్చు, కాంటాక్ట్‌ ట్రేసింగ్, లాక్‌డౌన్‌ దశలవారీగా ఉపసంహరణ ఇలా అనేక అంశాలను గమనించి.. ఈ ర్యాంకులను విడుదల చేసింది.

ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన దేశం క్యూబా (90.74).. తర్వాతి స్థానాల్లో ఎరిత్రియా(89.81), ఐర్లాండ్‌(87.96), హొండూరస్‌(87.96), లెబనాన్‌(87.04), బ్రిటన్, పెరూ(86.11) ఉన్నాయి. మన విషయానికొస్తే.. భారత్‌కు 68.98 పాయింట్లు రాగా.. చైనాకు 78.24, అమెరికాకు 71.76, ఫ్రాన్స్‌కు 63.89 వచ్చాయి. లాక్‌డౌన్‌ మార్కుల స్కేల్‌పై వివిధ దేశాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే..    

మరిన్ని వార్తలు