కుప్పకూలిన ప్రపంచ ప్రసిద్ధ సహజ శిలాతోరణం

19 May, 2021 12:00 IST|Sakshi
కుప్పకూలక ముందు సహజ శిలా తోరణం ‘డార్విన్స్‌ ఆర్చ్‌’

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ద్వీపకల్పంలో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రసిద్ధ పర్యాటక కట్టడం కుప్పకూలిపోయింది. వైల్డ్‌లైఫ్‌ ప్రియులకు ఇది చేదువార్తే. గాలాపోగోస్‌ ద్వీపంలో సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్‌ ఆర్చ్‌ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఈక్వెడార్‌ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తోంది.

ఒకప్పుడు డార్విన్‌ ద్వీపంలో ఈ కట్టడం ఓ భాగంగా ఉందంట. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్‌ అద్భుతంగా కనిపించేంది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్‌ డార్విన్‌ పేరు మీదుగా డార్విన్‌ ఆర్చ్‌ పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో దీనికి చోటు కల్పించింది. 

గాలాపాగోస్‌ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అడ్వైంచర్స్‌, సాహసాలు చేయాలనుకున్న వారికి ఇది అనువైన ప్రాంతం. ఫొటో షూట్‌లకు పేరు పొందింది. డార్విన్‌ ఆర్చ్‌ కూలిపోయిందని ఈక్వెడార్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రక సహజ కట్టడంలో ప్రస్తుతం రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ ఫొటోలు విడుదల చేసింది. 
 


కూలిన అనంతరం రెండు స్తంభాలుగా నిలిచిన సహజ శిలా తోరణం ‘డార్విన్స్‌ ఆర్చ్‌’

మరిన్ని వార్తలు