యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!

1 Dec, 2020 12:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నటి మోహ్విష్ హయత్ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో ప్రేమయాణం నడుపుతోందని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుకుడిని వివాహం చేసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మోహ్విష్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మీరు ఎటువంటి వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటున్నారు? అని యాంకర్‌ ప్రశ్న అడగ్గా.. మంచి ఎత్తు ఉండాలని, అదే విధంగా ఆకర్షనీయమైన రంగు ఉండాలని తన మనసులో మాటను తెలిపారు. ఇటీవల పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి ఎన్నికైన బిలావల్ భుట్టో జర్దారీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడున్నారా? మీరు ఆయనలా ఉండే వ్యక్తిని విహహం చేసుకుంటారా? అని హోస్ట్‌ ప్రశ్నించారు. చదవండి: అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్‌ భుట్టో

దీనికి స్పందించిన మోహ్విష్.. మీరు బిలావల్‌ భుట్టో గురించి అడుతున్నారా? అని బదులిస్తూ.. అతడు చాలా అందంగా ఉంటాడని, యువ రాజకీయ నాయుకుడని ప్రశంసించారు. దీంతో మోహ్విష్‌.. బిలావల్‌ భుట్టో జర్దారీని వివాహం చేసుకోబోతున్నారని, ఇప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఇప్పటి వరకు స్పందిచలేదు. కాగా, బిలావాల్ భుట్టో జర్దారీ.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహ్విష్‌ దావుద్‌ ప్రేయసి అని ప్రచారంలో ఉంది. వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2019లో తెరపైకి వచ్చింది. దావుద్‌ ఆమెను ఓ ఐటెం సాంగ్‌లో చూసి మనసు పారేసుకున్నట్లు పాక్‌ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. ఆమెకు దావుద్‌ వల్లనే పలు సినిమా అవకాశాలు వస్తున్నాయని, అదే విధంగా పాకిస్తాన్ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డు వెనక కూడా ఆయన హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్‌ చేశాయి. దావుద్‌కి తనకు ప్రేమ ఉందని వస్తున్న వార్తలపై మోహ్విష్‌ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా