ఉక్రెయిన్‌లో శవాల దిబ్బలు

17 Sep, 2022 06:23 IST|Sakshi

ఇజియం (ఉక్రెయిన్‌): ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ బలగాలు గుర్తించాయి. కొన్నింటిపై తూటాల గాయాలుండగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల్లో మరణించి ఉంటారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలకు చెవులు కోసేసి ఉండటంతో రష్యా సైనికులు చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్కడికి సమీపంలోనే మరో చోట 17 ఉక్రెయిన్‌ సైనికుల మృతదేహాలను కొనుగొన్నారు. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ..బుచా, మరియుపోల్, ఇజియం..రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసింది. ఇందుకు ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. ఇలా ఉండగా, రష్యాను సైనికపరంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరో 600 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు