-

క్వీన్‌ ఎలిజబెత్‌-2 కన్నుమూత: 50 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌ అంత్యక్రియలు

9 Sep, 2022 20:43 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్‌ ఎలిజబెత్‌-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత.

సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం బాల్మోరల్‌ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్‌ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్‌క్యారేజీపై క్వీన్‌ ఎలిజబెత్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి.

ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్‌ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు.

ఐతే బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ 2 జ్ఞాపకార్థం డెత్‌ గన్‌సెల్యూట్‌ సందర్భంగా శుక్రవారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్‌ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్‌ షాట్‌లతో క్విన్‌ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్‌  అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ కోట, నార్తర్న్‌ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట​, వేల్స్‌లోని కార్డిఫ్‌ కోట నుంచి కాల్పులు నిర్వహించారు.

(చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్‌ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్‌)

మరిన్ని వార్తలు