రాయ్‌ తుపాను ధాటికి 208 మంది మృతి

20 Dec, 2021 14:48 IST|Sakshi

strongest typhoon to hit the Philippines: ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు 208 మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తుపాను వల్ల ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి.

(చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!)

కాగా, ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని చెప్పారు. ఈ మేరకు కోస్తా ప్రాంతాల్లో మొత్తం తుడుచి పెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్‌ రెడ్‌క్రాస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది పై తుపాను ప్రభావం పడింది. ఈ తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. కేవలం రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు ఫిలిప్పీన్స్‌లోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పైగా సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మేరకు భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అంతేకాదు చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

(చదవండి: బాప్‌రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్‌ వీడియో)

మరిన్ని వార్తలు