చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..

24 Aug, 2020 17:46 IST|Sakshi
వెంటిలేటర్‌పై సితి

జకార్తా : చనిపోయిన ఓ బాలిక అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా మళ్లీ ఊపిరి పీల్చుకోవడం కుటుంబసభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. వారి కళ్లలో సంతోషాన్ని నింపింది. అయితే ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. ఈ వింత సంఘటన ఇండోనేషియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, ఈస్ట్‌ జావాకు చెందిన సితి మస్‌ఫుఫాహ్‌ వర్దాహ్‌ అనే 12 ఏళ్ల బాలిక క్రోనిక్‌ డయాబెటీస్‌తో బాధపడుతూ ఈ నెల 18న అక్కడి ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. దీంతో సితి మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు కుటుంబసభ్యులు. అంత్యక్రియల కోసం శవాన్ని సిద్ధం చేయటానికి ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయించారు. స్నానం అనంతరం సితి శరీరం వెచ్చగా మారింది. ( కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్‌ )

మూసుకున్న కళ్లు ఠక్కున తెరుచుకున్నాయి. గుండె మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించి, శరీరంలో కదలిక మొదలైంది. ఈ నేపథ్యంలో సితి తండ్రి వైద్యులను తీసుకువచ్చాడు. వారు బాలికకు ఆక్సిజన్‌ అందించారు. అయితే ఓ గంట తర్వాత మళ్లీ చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు మృతదేహానికి మళ్లీ స్నానం చేయించి అక్కడి ఓ శ్మశానంలో ఖననం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా