అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధంపై నిర్ణయం వాయిదా 

10 Jun, 2021 09:04 IST|Sakshi

వాషింగ్టన్‌: చైనాకు చెందిన టిక్‌టాక్, విచాట్‌లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత జో బైడెన్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆయా యాప్‌లు అమెరికా జాతీయ భద్రతకు విసిరే సవాళ్లపై స్వయంగా సమీక్ష చేసిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్‌హౌస్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. చైనా రూపొందించిన, చైనా నియంత్రణలో ఉన్న, చైనా మిలటరీ, నిఘా వర్గాలతో సంబంధం ఉన్న యాప్‌ల పనితీరును పరిశీలించాలని, ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే యాప్‌లను సమగ్రంగా పరీక్షించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికన్ల వ్యక్తిగత, ఆరోగ్య, జన్యు సమాచార భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు