లేడీ కస్టమర్‌ విచిత్ర రిక్వెస్ట్‌.. డెలివరీ బాయ్‌ షాక్‌!

12 Feb, 2021 18:19 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బీజింగ్‌ : ఓ లేడీ కస్టమర్‌ విచిత్రమైన రిక్వెస్ట్‌తో ఫుడ్‌ డెలివరీ బాయ్‌‌ షాక్‌ అయ్యాడు. అనంతరం కస్టమర్‌ రిక్వెస్ట్‌ వెనకున్న బలమైన కారణం అర్థం చేసుకున్నాడు. కస్టమర్‌ కోరినట్లుగానే ఆమె మాజీ ప్రియుడి ముఖంపై కాఫీ చల్లాడు. వివరాలు.. చైనాలోని షాంగ్‌డాంగ్‌కు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సైట్‌లో ఓ కాఫీ ఆర్డర్‌ చేసింది. అయితే అది తనకోసం కాదు! మాజీ ప్రియుడి కోసం. ‘‘ అతడితో మర్యాదగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. అతడి ముఖంపై కాఫీ చల్లితే సరిపోతుంది’’ అని ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని ఓ స్పెషల్ రిక్వెస్ట్‌ చేసుకుంది‌. కస్టమర్‌ విచిత్రమైన రిక్వెస్ట్‌తో డెలివరీ బాయ్‌ మొదట షాక్‌ అయినా.. ఆ తర్వాత ఆమె చెప్పినట్లుగానే చేయటానికి సిద్ధపడ్డాడు. ( లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ )

ఆమె మాజీ ప్రియుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనే అతడిపై కాఫీ చల్లాడు. కస్టమర్‌ మాజీ ప్రియుడు.. డెలివరీ బాయ్‌ చర్యతో షాక్‌ తిన్నాడు. ఏం జరుగుతోందో అర్థంకాక అతడివైపు చూశాడు. డెలివరీ బాయ్‌ ఆ వెంటనే తన చేతిలోని ఓ చీటీ ముక్క కస్టమర్‌ మాజీ ప్రియుడి చేతిలో పెట్టి, క్షమాపణలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల వద్దనుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

మరిన్ని వార్తలు