డెల్టా వేరియంట్‌తో పెనుముప్పు: ఫౌచీ

24 Jun, 2021 02:15 IST|Sakshi

వాషింగ్టన్‌: కోవిడ్‌ మహమ్మారి నిర్మూలన కోసం అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్‌ పెనుముప్పుగా పరిణమించిందని అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ అన్నారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ ప్రభావం తీవ్రంగా ఉంటోందని గుర్తుచేశారు.

అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 20 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని తెలిపారు. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 10 శాతమే ఉండేదన్నారు. అంటే కేవలం వారం రోజుల్లోనే ఈ వేరియంట్‌ వ్యాప్తి రెట్టింపు అయ్యిందని వెల్ల డించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని డెల్టా రకం వణికిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్థంగా ప్రభావం చూపుతున్నాయని, ఇది గుడ్‌న్యూస్‌ అని చెప్పారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు