డెల్టా వేరియంట్‌ డేంజరస్‌

4 Jul, 2021 10:14 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న దేశాల్లో అధికంగా వ్యాప్తి

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌

ఐరాస/జెనీవా: కరోనా డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని, క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రమాదకరంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అడానోమ్‌ ఘెబ్రేయెసుస్‌ హెచ్చరించారు. కోవిడ్‌–19 మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రమాదకర దశను ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్న దేశాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని, ఆసుపత్రులు మళ్లీ బాధితులతో నిండిపోతున్నాయని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో డెల్టా వేరియంట్‌ ఆధిపత్య వేరియంట్‌గా మారుతోందని వెల్లడించారు. ప్రజారోగ్య రంగం స్పందనే దీనికి విరుగుడు అని చెప్పారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదని డాక్టర్‌ టెడ్రోస్‌ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 98 దేశాల్లో డెల్టా వేరియంట్‌ ఉనికి బయటపడిందని, వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న దేశాలకు వ్యాప్తి చెందుతోందని డాక్టర్‌ టెడ్రోస్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు