Ebola Virus: మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది..

24 Apr, 2022 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక​ ఆఫ్‌ కాంగోలో వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్‌ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి  ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. 
చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు

‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్‌ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు.  కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య  సంస్థ పేర్కొంది. 
చదవండి👉🏻 ట్రిపుల్‌ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు

మరిన్ని వార్తలు