స్కిన్‌ ఎలర్జీ.. ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్న యువతి!

24 Aug, 2020 08:22 IST|Sakshi

సాధారణంగా చర్మంపై దద్దుర్లు వచ్చినా.. కాస్త మంట పుట్టినా ఏమైందోనని కంగారు పడి డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవాళ్లు చాలామందే ఉంటారు. వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకుని మందులు వాడతారు. అయితే డెన్మార్క్‌ చెందిన ఓ యువతి మాత్రం తనకు ఉన్న అరుదైన చర్మ వ్యాధిని ఓ హాబీగా మలచుకుంది. కుంచెపై గీయాల్సిన కళాకృతులను చర్మంపై గీస్తూ కాన్వాస్‌లా మార్చేసుకుని నలుగురిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. వివరాలు... ఆరస్‌ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువతి ఎమ్మా అల్డెన్‌రిడ్‌కు డెర్మాటోగ్రఫియా అనే డిజార్డర్‌ ఉంది. (600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్‌)

సాధారణ పరిభాషలో దీనిని స్కిన్‌ రైటింగ్‌ అంటారు. చర్మం ఉబ్బిపోవడం, ఎర్రగా మారడం, విపరీతమైన దురద దీని లక్షణాలు. అంతగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఈ ఎలర్జీ కారణంగా నలుగురిలో ఉన్నపుడు కాస్త ఇబ్బందికరంగా ఫీల్‌ అవుతారు డెర్మాటోగ్రఫియా ఉన్నవాళ్లు. కాగా మూడేళ్ల క్రితం ఎమ్మా చేతులపై ఈ వ్యాధి లక్షణాలను గమనించిన ఆమె స్నేహితురాలు ఈ విషయాన్ని తనతో పంచుకుంది. అయితే విచిత్రంగా తనతో పాటు తన కజిన్స్‌కు కూడా ఇదే తరహా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకుంది. దీంతో పెద్దగా ఇబ్బంది లేదని తెలుసుకున్న ఎమ్మా.. అప్పటి నుంచి చర్మం ఉబ్బిన ప్రతిసారి అప్పటికప్పుడు తనకు పెన్సిల్‌తో తోచిన డ్రాయింగ్‌ వేస్తూ, పేర్లు రాస్తూ ఆ ఫొటోలు తన స్నేహితులతో పంచుకుంటోంది.(ట్విటర్‌లో కొత్త జీవిని కనుగొన్న ప్రొఫెసర్‌)

ఈ విషయం గురించి ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీకి వెళ్లిన సందర్భాల్లో సన్నిహితులను సర్‌ప్రైజ్‌ చేయడానికి ఈ ట్రిక్‌ ఉపయోగిస్తున్నా. నోటితో పలికిన పదాలను ఇలా చర్మంపై ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతారు. వాళ్లు కూడా నాలాగే చర్మంపై డిజైన్స్‌ వేయాలని ప్రయత్నిస్తారు. కానీ కుదరదు. కొంతమందేమో దీని వల్ల నీకు ఇబ్బంది అనిపించదా అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే డెర్మాటోగ్రఫియా వల్ల నాకెప్పుడూ ఇబ్బంది తలెత్తలేదు. అయితే ఒక్కోసారి విపరీతమైన దురద వస్తుంది. అప్పుడు నా పరిస్థితిని చూస్తే నాకు ఏమైపోతుందోనని పక్కనున్న వాళ్లు భయపడిపోతారు. కానీ ఈ డిజార్డర్‌ నా జీవితంపై ఇంతవరకు ఎలాంటి దుష్ప్రభావం చూపలేదు. డాక్టర్లు కొన్ని మందులు రికమండ్‌ చేశారు. కానీ వాటి వల్ల ఈ గీతలు, రాతలు రాయలేను కాబట్టి వాటిని వాడటం మానేశా’’అని చెప్పుకొచ్చింది.  

#dermatographia #skinwriting #hi

A post shared by Dermatographia (@dermatographia_) on

మరిన్ని వార్తలు