భారత్‌కు నమ్మదగ్గ.. నేస్తం మేమే: అమెరికా 

23 Apr, 2022 06:33 IST|Sakshi

వాషింగ్టన్‌: చైనా విసురుతున్న ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్, ఆస్ట్రేలియాలతో అమెరికా బంధం మరింత బలపడాలని ఆ దేశ కాంగ్రెస్‌ సభ్యుడు, హౌస్‌ ఆరమ్డ్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ ఆడమ్‌ స్మిత్‌ అన్నారు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, భారత్‌కు అత్యంత విశ్వసనీయమైన నేస్తం రష్యా కాదని, అమెరికానే అని ఆ దేశ విదేశాంగ శాఖ కౌన్సెలర్‌ డెరెక్‌ చాలెట్‌ అభిప్రా యపడ్డారు. భారత్‌ రక్షణ అవసరాలన్నింటినీ అమెరికా తీరుస్తుందని చెప్పారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేయడానికి అమెరికా ఎంతో ఉత్సాహంగా ఉందని వెల్లడించారు.   

చదవండి: (Russia-Ukraine war: మారియుపోల్‌లో మారణహోమం?)

మరిన్ని వార్తలు