విషాదం: భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి

9 Jul, 2021 15:39 IST|Sakshi

ఢాకా శివారులోని రూప్‌గంజ్‌లోని కర్మాగారంలో చెలరేగిన మంటలు

50 మందికిపైగా తీవ్ర గాయాలు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ కారాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఢాకా శివారులోని రూప్‌ గంజ్‌లోని కర్మాగారంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

అగ్నిమాపక అధికారులు వివరాల ప్రకారం..  రుప్‌గంజ్‌లోని షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. కర్మాగారంలో రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఎక్కువగా ఉండడంతో భవనం మొత్తం మంటలు త్వరగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతి చెందారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 18 అగ్నిమాపక విభాగాలు కష్టపడుతున్నాయని, సహాయక చర్యులను ముమ్మరం చేశామని అన్నారు. తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాడానికి జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు