Diamond Gold Rainstorm: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?

30 Nov, 2021 21:10 IST|Sakshi

James & Jewellery International Exhibition: ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో సూరత్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఈసారి జరిగిన జేమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఇంటర్‌నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో సూరత్‌ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన అరుదైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూరత్‌ వ్యాపారులు వజ్రాలతో తయారు చేసిన గొడుగు సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం..

ఈ డైమండ్‌ గొడుగును తయారు చేసిన చేత్న మంగూకియా మాటల్లో.. ‘175 క్యారెట్ల డైమండ్‌ను ఈ గొడుగులో ప్రత్యేకంగా అమర్చాం. అంతేకాకుండా 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో తయారుచేశాం. దాదాపు 25 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజులపాటు దీనిని తయారు చేశారు. డైమండ్‌ మార్కెట్‌లో దీని ధర 25 నుంచి 30 లక్షల వరకు పలకొచ్చు. సాధారణంగా అమెరికా, యూరప్‌, హాన్‌కాంగ్‌ వంటి దేశాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయని’ మీడియాకు వెల్లడించారు. 

చదవండి: Smart Phone Addiction: స్మార్ట్‌ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు

ఈ ఎగ్జిబిషన్‌ను చూసిన గ్రేసీ అనే మహిళ ‘ఒకటికంటే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఇక్కడ ఉ‍న్నాయి. వీటన్నింటికంటే వజ్రాల గొడుగు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంద’ని పేర్కొంది. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడుతుంటే.. వజ్రాల పరిశ్రమ మాత్రం రెక్కలు విప్పుకుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.

చదవండి: వృత్తేమో టీచర్‌... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!

మరిన్ని వార్తలు