అదిరిపోయే వేలం.. ప్రారంభ ధరే రూ.38 కోట్లా?.. వర్కవుట్‌ అయితే రికార్డే!

23 Apr, 2022 21:20 IST|Sakshi

వేలం పాటలో ప్రాచీన వస్తువులకు, అరుదైన వాటికి ఎక్కువ ధర పలుకుతుండడం చూస్తుంటాం. ఒక్కోసారి సెలబ్రిటీలు, మేధావులకు సంబంధించిన గుర్తులు సైతం భారీ ధరకు పోతుంటాయి. అలాంటిది ఒక వస్తువు.. ప్రారంభ ధరనే భారీగా ఉండడం ఇక్కడ విశేషం. 

అర్జెంటీనా సాకర్‌ దిగ్గజం డియెగో మారడోనా, జెర్సీని వేలం వేయబోతున్నారు. అది మాములు జెర్సీ కాదులేండి. 1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జెర్సీనే ధరించాడు. రెండుసార్లు గోల్స్‌ చేయడమే కాదు.. అందులో ఒకటైన హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌ కూడా నమోదు అయ్యింది ఈ మ్యాచ్‌లోనే. 

బుధవారం నుంచి నెంబర్‌ 10 ఉన్న ఈ బ్లూ జెర్సీని వేలం వేయడం మొదలుపెట్టారు. ఆరంభ ధర ఎంతో తెలుసా? 5 మిలియన్‌ డాలర్ల పైనే. అంటే.. మన కరెన్సీలో సుమారు 38 కోట్ల రూపాయలపైనే!. మే 4వ తేదీ వరకు ఈ వేలంపాట కొనసాగనుంది. న్యూయార్క్‌కు చెందిన సోత్‌బైస్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కంపెనీ.. ఈ వేలం నిర్వహించనుంది.

క్రీడా ప్రపంచంలో ఇప్పటిదాకా 5.6 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికన్‌ బేస్‌బాల్‌ ప్లేయర్‌ బాబే రూత్‌ జెర్సీ. న్యూయార్క్‌ యాంకీస్‌ తరపున ఆయన ఆడినప్పుడు ధరించిన జెర్సీ.. 2019లో వేలంపాటలో ఈ రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పుడు మారడోనా జెర్సీ ఆ రికార్డును బద్ధలు కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చదవండి: చిటికెడు మట్టి రూ.4 కోట్లు

మరిన్ని వార్తలు