ఆంథోనీ ఫౌసీ: భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది

24 Apr, 2021 15:03 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ భారత్‌కు సహాయం అందించే విషయంపై సానుకూలంగా స్పందించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కరోనా విషయంలో  భారత్ ప్రస్తుతం చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని కనుకు భారత్‌ను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించిందన సంగతి తెలిసిందే. దీనిని సమర్థించుకుంటూ అమెరికా వర్గాలు తమకు అమెరికా ప్రజల బాధ్యతలను పట్టించుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. ఈ కారణంగా భారత్‌కు  సహాయం చేయలేక పోతున్నామని అన్నారు.

ఆంథోనీ మాట్లాడుతూ.. నిన్న ఒక్క రోజే  ఏ దేశంలోనైనా నమోదు కానీ అత్యధిక సంఖ్యలో కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి. అక్కడ వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల నేఫథ్యంలో భారత్‌కు వాక్సిన్‌ల అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందని స్పష్టంగా భావిస్తున్నామని అన్నారు. అందుకు యూఎస్‌ నుంచి భారత్‌కు ఎలాగైనా సహాయం అందించాలని సానుకూలంగా స్పందించారు. ఇటీవల ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రిన్స్ భారత్‌కు ముడి సరుకులు నిలిపివేయడాన్ని సమర్థించుకున్న పరిణామం తరువాత బిడెన్‌ ప్రధాన సలహాదారుడైన డాక్టర్‌ ఆంథోని ఫౌసీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం భారత్‌కు మేలు  చేకూరేలా ఉన్నాయనే చెప్పాలి.

కరోనా మహమ్మారి ప్రారంభ దశ నుంచి అమెరికా భారత్‌కు అత్యవసర సహాయ సామాగ్రి, వైద్య వినియోగ వస్తువులు, అధికారులకు మహమ్మారి శిక్షణ, వెంటిలేటర్ల లాంటి సరఫరా చేసింది. అయితే  యూఎస్‌ అధికారులు మొదటి లక్ష్యమైన అమెరికన్ల బాగోగుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు గతంలో ట్రంప్‌ కూడా డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని వారు గుర్తు చేశారు. ఈ చట్టం కారణంగా అమెరికాకు చెందిన కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మొదటగా అమెరికా అవసరాలు తీర్చాల్సి ఉంటుందని అన్నారు. దీని కారణంగా ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

( చదవండి: కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు )

>
మరిన్ని వార్తలు