విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట

31 Oct, 2023 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ:  వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా  విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది.  తమకు జరిగిన అవమానాన్ని  తడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో చివరకు ఎయిర్‌ కెనడా  క్షమాపణ  చెప్పింది.

బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్  రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ  బాధితుడు. వీల్‌ చెయిర్‌ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో  వివాహ వార్షికోత్సవ  వేడుకుల కోసం  ఎయిర్‌ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు.  ఈ సందర్భంగా  విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్‌ కావాలని అడిగాడు. అయితే  విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు  ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.   


 రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్‌ ఫోటో)

ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని  తెలిపారు.  ఈ ఘటనలో శారీరక బాధలతో  పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్‌ చేస్తున్న టూర్‌ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్‌ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్‌ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు.

 పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్
పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై  రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు.  తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు.
 

మరిన్ని వార్తలు