యూఎస్‌ ఇలానే ఆయుధాలు సరఫరా చేస్తే.. విధ్వంసకర దాడి చేస్తాం!

27 Aug, 2022 10:12 IST|Sakshi

మాస్కో: రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందే తప్ప ఆపదు! అని రష్యా భద్రత డిప్యూటీ చైర్మన్‌, మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ వ్యాఖ్యానించారు. ఒక వేళ​ ఉక్రెయిన్‌ నాటోలో చేరనని అధికారికంగా ప్రకటించిన రష్యా తన నిర్ణయాన్ని మార్చుకోదు అని కరాఖండిగా చెప్పేశారు.

ఈ మేరకు ఆయన ఫ్రెంచ్‌​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..."తాము ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీతో చర్చలు జరిపినప్పుడు కొన్ని షరతులు గురించి చెప్పాం. ఆఖరికి ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించడానికి ముందు కూడా నాటోలో చేరడాన్ని తాము అంగీకరించం అని చాలా స్పష్టంగా ఉక్రెయిన్‌కి చెప్పాం. అయినా ఇప్పుడూ ఉక్రెయిన్‌‍కి  నార్త్‌ అట్లాంటిక్‌లో భాగస్వామ్యం కానని ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు.

అయినప్పటికీ  ఇరు దేశాల మధ్య అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తిరిగి శాంతి నెలకొల్పడం కూడా కష్టమే. పైగా రష్యా కూడా తన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ యుద్ధాన్ని ఆపదు." అని తేల్చి చెప్పారు. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లక్ష్యం ఉక్రెయిన్‌ని నాటోలో చేరుకుండా చేయడమేనని చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా పలు దఫాలుగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగాయి, కానీ వాటిలో పెద్దగా పురోగతి కనిపించలేదన్నారు.

ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఐతే ఈ చర్చలు ఎలా సాగుతాయనే దానిపైనే ఆధారపడి ఉందని చెప్పారు. తాము కూడా జెలెన్‌స్కీతో మరోసారి చర్చలు సాగించేందుకు సుమఖంగానే ఉన్నామని మెద్వెదేవ్‌ చెబుతున్నారు.

ఉక్రెయిన్‌కి యూఎస్‌ ఆయుధాల సరఫరా చేసిన విషయం గురించి ప్రస్తావిస్తూ.... తాము ప్రయోగించిన బహుళా రాకెట్‌ లాంచెర్‌ ఉక్రెయిన్‌లో ఇంకా పెను విధ్వంసాని సృష్టించలేదు. కానీ యూఎస్‌ ఇలానే ఆయుధాల సరఫరాను కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా ఆ విధ్వంకర దాడి జరుగుతుందని హెచ్చరించారు. 

(చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్‌స్కీకి సపోర్ట్‌పై భారత్‌ ‘టెక్నికల్‌’ వివరణ)

మరిన్ని వార్తలు