-

వ్యాక్సిన్‌తో గర్భధారణపై ప్రభావం.. నిజమేంటంటే!

13 Aug, 2021 18:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నందువల్ల గర్భధారణ అవకాశాలపై ప్రభావం పడదని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ కారణంగా గర్భధారణ అవకాశాలు తగ్గుతాయనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కొందరు మహిళలకు వ్యాక్సిన్‌ ఇచ్చి, మరికొందరికి ఉత్తుత్తి వ్యాక్సిన్‌ ఇచ్చి.. అమెరికా ఔషధ సంస్థ ఫైజర్‌ ఓ అధ్యయనం చేసింది. రెండు గ్రూపుల్లోనూ గర్భం దాల్చిన వారి సంఖ్య సమానంగా ఉందని తెలిపింది. వ్యాక్సిన్‌ తర్వాత తమ రుతుక్రమంలో స్వల్ప తేడాలు వచ్చాయని చెప్పిన మహిళల కేసులనూ అధ్యయనం చేస్తున్నారు.

అయితే గర్భధారణకు వ్యాక్సిన్లతో ముప్పుందనడానికి ఆధారాలు లేవని యేల్‌ వర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిల్‌ ప్రొఫెసర్, గైనకాలజిస్టు మేరీ జేన్‌ మిన్‌కిన్‌ వెల్లడించారు. గర్భం కోసం ప్రయత్నిస్తున్నా, సంతాన సాఫల్య చికిత్సలు తీసుకుంటున్నా.. వెంటనే టీకా తీసుకోవాలని ఎమోరీ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ డెనిస్‌ జమైసన్‌ తెలిపారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీఎస్‌) గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇదివరకే సిఫారసు చేసింది. సాధారణ మహిళలతో పోల్చినపుడు కోవిడ్‌ సోకిన గర్భిణులు తీవ్రంగా జబ్బుపడే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు