ఏకరూప కవలల వేలిముద్రలు మారిపోతాయా?

3 Sep, 2021 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వేలిముద్రలు లేదా  ఫింగర్‌ ప్రింట్స్‌ మన జీవన విధానంలో వీటికున్న ప్రాధాన్యత చాలా కీలకం. జీవి గుర్తింపుకు  ప్రతీకలివి. అందుకే నేరస్తులను పట్టుకోవడంలో వేలిముద్రలు  ప్రధాన సాక్క్క్ష్యాలుగా మారిన ఉదాహరణలు ఎ‍న్నో..ఎందుకంటే ఈ భూమిపై ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి ఒకే డీఎన్‌ఏను పంచుకున్న ఏక రూప కవలల ఫింగర్‌ ప్రింట్స్‌  మాటేమిటి? లేదా వేరు వేరుగా ఉంటాయా? మధ్యలో మారిపోతాయా? ఈ వేలిముద్రల ఆసక్తికర విషయాలగురించి తెలుసుకుందాం..

ఆధునిక సమాజంలో వ్యక్తి గుర్తంపునుంచి ఆఫీస్‌ అటెండెన్స్‌ నుంచి..అంతా ఫింగర్‌ప్రింట్‌ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ సిస్టంతోనే నడుస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఏ ఇద్దరి ఫింగర్‌ ప్రింట్స్‌ ఒకరితో ఒకరికి సరిపోలవు. అంతేకాదు ఒకే వ్యక్తికి సంబంధించిన ఏ రెండు వేళ్ళ ముద్రలు కూడా ఒకేలా ఉండవు, వాటిని ఎవరూ దొంగిలించలేరు కూడా. ఎందుకో తెలుసా..! జన్యుపరమైన నిర్మాణాన్ని అనుసరించి వేళ్లపై ఉండే గీతలు రూపొందుతాయి కాబట్టి. మరి ఒకే డీఎన్‌ఏను పంచుకునే ఏక రూప కవలల ఫింగర్‌ ప్రింట్స్‌ విషయమేంటి? వారి వేలి ముద్రలు ఒకేలా ఉంటాయా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..ఏక రూప కవలలను మోనోజెనెటిక్‌ ట్విన్స్‌ అనికూడా అంటారు. అంటే ఒకే అండం (జైగోట్‌) నుంచి అభివృద్ధి చెంది, పెరెంట్స్‌ నుంచి దాదాపుగా ఒకే జన్యువులను పంచుకుని ఒకేలా కనిపించే కవలలు అన్నమాట!

సమరూపజీవులకు ఒకే గర్భం సమానంగా స్థలాన్ని పంచినా, జెనెటిక్‌ నిర్మాణాన్ని మాత్రం వంద శాతం సమానంగా ఒకేలా పంచదని పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైవ్‌ సైన్స్‌ విభాగం గతంలో వెల్లడించింది. ఏదిఏమైనప్పటికీ.. ఏకరూపకవలల ఫింగర్‌ ప్రింట్స్ ఒకేలా ఉండవని ఫోరెన్సిక్‌ సైంటిస్ట్ సిమోనా ఫ్రాన్సిస్‌ (షిఫీల్డ్‌ హల్లామ్‌ యూనివర్సిటీ ) స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉన‍్నట్టు నిరూపించబడలేదు. వేళ్ళపై ఉండే రిడ్జ్‌ ప్యాట్రన్‌ మార్పుకు కేవలం డీఎస్‌ఏ మాత్రమే కారణం కాదు. గర్భంలోని భిన్న వాతావరణ కారకాలు కూడా వేలి ముద్రల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సాధారణంగా అభివృద్ధి చెందిన గర్భస్థ శిశువుకు 13 నుంచి 19 వారాల వ్యవధిలో వేలి ముద్రలు రూపొందుతాయి. ఈ  సమయంలో గర్భం వైశాల్యం, బొడ్డు తాడు పొడవు, తల్లి నుంచి సంక్రమించే పోషకాల స్థాయి.. వేలి ముద్రల నిర్మాణంలో ప్రభావం చూపుతాయి. కవలలు పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేలి ముద్రలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారే అవకాశం కూడా ఉంది. అంటే.. చర్మ స్వభావం, మచ్చలు, కాలిన గాయాలు, వాడే మందులు వంటి అరుదైన పరిస్థితుల్లో వేలి ముద్రలు మారతాయని ఫ్రాన్సిస్‌ తెలిపారు. ఏకరూప కవలలు తమ పేరెంట్స్‌ను, ఫ్రెండ్స్‌ను.. ఇతరులను మోసం చేయవచచ్చునేమో కానీ, వేలి ముద్రలు మాత్రం పట్టించేస్తాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు