భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు

15 Nov, 2020 10:49 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాన్సర్‌‌ వ్యాధితో చివరి రోజులు లెక్కబెడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు వైద్యుడు బ్యాట్‌‌మెన్‌గా‌ కనిపించిన వీడియో నెటిజన్‌లను క‍న్నీళ్లు పెట్టిస్తోంది. ఫీల్‌ గుడ్‌ అనే ట్విటర్‌ పేజీలో శనివారం షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమెరికాలోని నార్త్‌ డకోటాకు చెందిన ఓ డాక్టర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల చిన్నారి కోసం‌ బాట్‌మెన్‌‌ వేషం​ వేసి ఆనందపరిచిన ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. దీంతో ఆ వైద్యుడి‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 44 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో క్యాన్సర్‌ బాధిత చిన్నారిని నీ అతి పెద్ద కోరిక ఏంటి అని అడిగినప్పుడు...ఆ చిన్నారి తన అభిమాన సూపర్‌ హీరో బ్యాట్‌మెన్‌ను‌ కలవాలన్న కోరిక వెల్లడించాడు. (చదవండి: అమిత్‌షా ట్విట్టర్‌ ఖాతా తాత్కాలిక నిలిపివేత)

దీంతో కొంత సమయం తర్వాత ఆ డాక్టర్‌ బ్యాట్‌మెన్‌‌ దుస్తులు ధరించి ఆస్పత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చాడు. ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి తనని హత్తుకొమ్మని అడిగాడు. ఆ బాలుడు హత్తుకోగానే... నిన్ను ఇబ్బంది పెడుతున్న మహమ్మారితో ధైర్యంగా పోరాడు అంటూ  ధైర్యాని నింపాడు.  ఈ వీడియో షేర్‌ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘నేను దీన్ని పదిసార్లు చూశాను.. చూసిన ప్రతిసారి భావోద్యేగానికి లోనయ్యాను’, ‘ఈ వైద్యుడిని అతడి కుటుంబాన్ని దేవుడు ఆశ్వీర్వాదించాలని, ఆ దేవుడు చిన్నారిని క్యాన్సర్‌ నుంచి స్వస్థపరచాలని వేడుకుంటున్న’అంటూ నెటిజన్‌లు స్పందిస్తున్నారు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్‌!)

>
మరిన్ని వార్తలు