హౌస్‌ కీపర్‌ని పెళ్లి చేసుకున్న డాక్టర్‌

8 Sep, 2022 19:57 IST|Sakshi

ఓ పాకిస్తానీ జంట వింత ప్రేమ కథ. చాలా వరకు ప్రేమ కథల్లో తల్లిదండ్రులు అంగీకరించకపోవడం లేదా వేర్వేరు మతాలు లేదా వేరే వర్గం ప్రేమకి అడ్డంకిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జంట మధ్య ప్రొఫెషన్‌ పరంగానే చాలా వ్యత్యాసం ఉంది. వాళ్లు ఎలా ప్రేమించుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి డాక్టర్‌, అబ్బాయి హౌస్‌ కీపర్‌గా పనిచేస్తున్నాడు.

అసలేం జరిగిందంటే... పాకిస్తాన్‌కి చెందిన కిశ్వర్‌ సాహిబా ఎంబీబీఎస్‌ చదువుకున్న వైద్యురాలు. ఆమె పనిచేసే ఆస్పత్రిలోనే గదులు శుభ్రం చేసి టీలు అందించే షాహిద్‌ని ప్రేమించింది. ఒక రోజు వైద్యురాలు కిశ్వర్‌ అతడి ఫోన్‌ నెంబర్‌ని అడిగింది. ఆ తర్వాత వారు క్రమం తప్పకుండా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హఠాత్తుగా ఒకరోజు కిశ్వర్‌ షాహిదాకి ప్రపోజ్‌ చేసింది. ఒక్కసారిగా ఆమె అలా అడిగేటప్పటికీ షాహిదా షాక్‌కి గురవ్వడమే కాదు దెబ్బకి జ్వరం కూడా వచ్చేసింది. కొద్ది రోజుల్లనే వారిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. 

ఐతే ఆమె వివాహాన్ని ఆమె స్నేహితులు, బంధువులు వ్యతిరేకించారు. పైగా ఆమెను ఇది చాలా పిచ్చి నిర్ణయం అంటూ తిట్టడం మొదలు పట్టారు. దీంతో ఆమె ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తగా ఒక క్లినిక్‌ని తెరవాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది, ఇది అద్భుతమైన ప్రేమ కథ అని ఆ జంటని ప్రశంసిస్తున్నారు. 

(చదవండి: స్వీట్‌ బాక్స్‌ లేయర్ల మధ్య అరకోటిపైనే అక్రమ రవాణ!.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు