ఒక్క నిమిషమే కదా అనుకుంటే..? ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

11 Dec, 2022 08:41 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: ఒక్క నిమిషం.. ఇందులో ఏముంది. సింపుల్‌గా గడిచిపోతుంది. ఒక పాట వినాలన్నా, చూడాలన్నా నాలుగైదు నిమిషాలు పడుతుంది  అంటారా? కానీ ఒక్క నిమిషంలో డిజిటల్‌ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా.. ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఆన్‌లైన్‌ సేవల సంస్థ డొమో దీనిపై పరిశీలన జరిపి నివేదిక రూపొందించింది. మరి ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతోందో చూద్దామా..

డేటా లెక్క.. నోరు తిరగనంత!
స్టాటిస్టా సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న జనాభా సంఖ్య 500 కోట్లు దాటింది. 

మొత్తం భూమ్మీద ఉన్న జనాభాలో ఇది 62 శాతం

ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నవారిలో ఏకంగా 93 శాతం సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు. 

2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా సృష్టించిన, కాపీ చేసిన, వినియోగించిన డేటా లెక్కఎంతో తెలుసా.. 

97 జెట్టాబైట్లు.. అంటే లక్ష కోట్ల జీబీ (గిగాబైట్లు) డేటా అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే 10,00,00,00, 00,000 జీబీలు.

మరిన్ని వార్తలు