రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్‌

29 Mar, 2023 05:36 IST|Sakshi

వాషింగ్టన్‌: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్‌ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్‌ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు.

‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు