మాస్కో మేయర్‌ భార్య హంటర్‌ బైడెన్‌కు అంత సొమ్ము ఎందుకిచ్చారు?: ట్రంప్‌

31 Mar, 2022 19:06 IST|Sakshi

వాషింగ్టన్‌: రష్యాలోని బడా బాబులతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఆయన తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బైడెన్‌ కుటుంబానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి సమాచారం ఉన్న తనకు అందజేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు.

‘హంటర్‌ బైడెన్‌కు రష్యాలోని మాస్కో సిటీ మేయర్‌ భార్య 3.5 మిలియన్‌ డాలర్లు ఇచ్చారు. హంటర్‌కు అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో పుతిన్‌కు తెలుసు. కారణం పుతిన్‌ బయటపెట్టాలి’ అని ట్రంప్‌ అన్నారు. హంటర్‌కు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు.

చదవండి: (పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ప్రకటన)

మరిన్ని వార్తలు