Donald Trump: ట్విటర్‌లోకి ట్రంప్‌ గప్‌చుప్‌గా పునరాగమనం.. మళ్లీ నిషేధం!!

19 May, 2022 14:51 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వచ్చారు. నిషేధం తర్వాత చాలాకాలానికి ఆయన మళ్లీ ట్విటర్‌లో పోస్టులు చేయగలిగారు. కానీ, అంతలోనే ఆయనకు మళ్లీ షాక్‌ తగిలింది. 

ట్విటర్‌ బ్యాన్‌ ఎఫెక్ట్‌తో ట్రూత్‌ సోషల్‌ అంటూ ఓ కొత్త ప్లాట్‌ఫామ్‌ను లాంచ్‌ చేశారు డొనాల్ట్‌ ట్రంప్‌. అక్కడ ఆయన స్వేచ్ఛగా పోస్టులు చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో.. చాలాకాలం బ్యాన్‌ తర్వాత ఆయన ట్విటర్‌లోకి రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గప్‌చుప్‌ @PresTrumpTS యూజర్‌ నేమ్‌తో ట్విటర్‌లో ఆయన వరుస పోస్టులు చేస్తున్నారు. అయితే.. 

ఈ వ్వవహారం ఎంతో కాలం కొనసాగలేదు. మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌ ఆ వెంటనే ఆ అకౌంట్‌ను కూడా నిషేధించేసింది. మంగళవారం ఆ ట్విటర్‌ హ్యాండిల్‌పై నిషేధ నిర్ణయం తీసుకున్నామని, అప్పటికే 210 ట్వీట్లు పోస్ట్‌ అయ్యాయని, ఇవి ట్రంప్‌ సోషల్‌ ట్రూత్‌ నుంచి కాపీ పేస్ట్‌ చేసినవేనని ట్విటర్‌ పేర్కొంది. ఇంకో హైలైట్‌ ఏంటంటే.. ఈ అకౌంట్‌ ఏప్రిల్‌ నుంచి యాక్టివ్‌గా ఉందట!. ట్విటర్‌ నుంచి సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్న వ్యక్తులు, ఖాతాలు.. ఆ సస్పెన్షన్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తే.. ఆ  ఖాతాను పూర్తిగా నిషేధించే పాలసీని ట్విటర్‌ కలిగి ఉంది.

ఇదిలా ఉంటే.. యూఎస్‌ కాపిటోల్‌పై దాడి నేపథ్యంగా.. జనవరి 6వ తేదీ, 2021 నుంచి ట్విటర్‌ ఆయనపై నిషేధం విధించింది. ట్రంప్‌ ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉండడమే.. హింసకు కారణమని ప్రకటించింది ట్విటర్‌. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేస్తాడన్న నేపథ్యంలో.. ట్రంప్‌ రీ-ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది కూడా.

చదవండి: అమెరికాలో మంకీపాక్స్‌ వైరస్ తొలికేసు.. లక్షణాలు ఇవే!

మరిన్ని వార్తలు