ట్రంప్‌కు మద్దతుగా విరాళాల వర్షం

7 Aug, 2020 01:50 IST|Sakshi

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్‌ పార్టీ, డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార బృందం సంయుక్తంగా 16.5 కోట్ల డాలర్లను అత్యధికంగా ఒక్క జూలై నెలలోనే విరాళంగా పొందారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ రంగంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు మొత్తంగా 1.1 బిలియన్‌ డాలర్లు వారికి విరాళంగా వచ్చాయి. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో సిద్ధంగా ఉన్నాయని రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ(ఆర్‌ఎన్‌సీ) ప్రకటించింది. ట్రంప్‌ ప్రచారం కోసం ఆర్‌ఎన్‌సీ 300 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను తాజాగా రిక్రూట్‌ చేసుకుంది. దాంతో ట్రంప్‌ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారి సంఖ్య 1,500కు చేరింది.  

ఫేస్‌బుక్‌ నుంచి ట్రంప్‌ వ్యాఖ్యలు తొలగింపు
‘చిన్న పిల్లలకు కోవిడ్‌ సోకదు’ అని ట్రంప్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ని ఫేస్‌బుక్‌ తొలగించింది. కరోనా వైరస్‌కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేదిగా ట్రంప్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది తమ విధానానికి విరుద్ధమని, అందుకే దీన్ని తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ యాజమాన్యం ప్రకటించింది.

మరిన్ని వార్తలు