అక్కడ క్షణాల్లో బైడెన్‌ని ఓడిస్తా: ట్రంప్‌

11 Sep, 2021 17:20 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తన స్టైల్లో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు ట్రంప్‌. త్వరలో ప్రారంభం కానున్న బాక్సింగ్‌ మ్యాచ్ నేపథ్యంలో ఓ రిపోర్టర్‌ ఫోన్‌లో ట్రంప్‌తో..  బాక్సింగ్‌లో మీ డ్రీమ్‌ ఫైట్‌ ఎవరితో పోటీపడాలని భావిస్తున్నట్లు ప్రశ్నించాడు.

అందుకు బదులుగా ట్రంప్‌.. నేను ప్రపంచంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే, కేవలం ప్రొఫెషనల్ బాక్సర్‌తో మాత్రమే కాదని జో బైడెన్‌పై కూడా తలపడతానని తెలిపారు. దానికి వివరణగా బైడెన్‌తో పోరాటం నాకు చాలా సులువుగా ఉంటుందని, ఎందుకంటే ప్రస్తుతం ఆయన తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నాడు. అంతేగాక ఆయన చాలా అంటే చాలా త్వరగానే రింగ్‌లో డౌన్ అవుతారని, మొదటి కొన్ని సెకండ్లలో బైడెన్‌ ఓడిపోతారని అనుకుంటున్నానని ఫన్నీగా సమాధానిమిచ్చారు.

అయితే ఇటీవల అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించిన విషయంలో బైడెన్‌ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

చదవండి: 9/11 Attacks: దాడి టైంలో బుష్‌ ఎక్కడున్నాడు? బైడెన్‌ గురించి లాడెన్‌ చెప్పిందే జరుగుతోందా?

మరిన్ని వార్తలు