ఒమర్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

17 Oct, 2020 11:42 IST|Sakshi

అమెరికా : దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మిన్నిసోటా డెమొక్రాటిక్ పార్టీ‌ అభ్యర్థి ఇల్హాన్‌‌ అబ్దుల్లాహీ ఒమర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఒమర్‌ సొంత సోదరుడ్ని పెళ్లి చేసుకుందని, చట్ట విరుద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిందని ఆరోపించారు. ఒమర్‌పై అమెరికా న్యాయ వ్యవస్థ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో భాగంగా ట్రంప్‌ ఒకాలా, ఫ్లోరిడాలో పర్యటించారు. తన ప్రత్యర్థి సోమాలియాలో పుట్టిందని, ఈ కారణంగా మిన్నిసోటాలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘‘ ఆమె మన దేశాన్ని ద్వేషిస్తుంది. అసలు ప్రభుత్వమే లేని దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని ఎలా నడపాలో మనకు నేర్పుతుందా?.. తను నిజంగా ఓ అద్భుతమైన మహిళ’’ అంటూ ఎద్దేవా చేశారు. ( భారత్‌పై ట్రంప్‌ విమర్శలు )

కాగా, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాంపెయిన్‌ ఖాతాను ట్విటర్‌ గత గురువారం కొద్దిసేపు బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌ కుమారుడిపై ట్రంప్‌ బృందం ఓ వీడియాను పోస్ట్‌ చేయగా అది నిబంధనలకు విరుద్ధమని ట్విటర్‌ టీమ్‌ ట్రంప్‌ ఖాతాను‌ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్విటర్‌ తీరుపై రిపబ్లికన్‌ సభ్యులు మండిపడ్డారు. దీనిపై తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియా కంపెనీలు స్వేచ్ఛను హరిస్తూ స్పీచ్‌ పోలీస్‌గా వ్యవహరిస్తున్నాయని దీనికి ట్విటర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు